బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 19:58:43

జులై 6న తాజ్ మ‌హ‌ల్, ఎర్ర‌కోట‌ ఓపెన్

జులై 6న తాజ్ మ‌హ‌ల్, ఎర్ర‌కోట‌ ఓపెన్

న్యూఢిల్లీ : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను కేంద్రం మూసివేసిన విష‌యం విదిత‌మే. అయితే ఈ క‌రోనా కాలంలో తీవ్రంగా న‌ష్ట‌పోయిన ప‌ర్యాట‌క రంగాన్ని పున‌రుద్ధ‌రించే ప్ర‌య‌త్నంలో భాగంగా అన్ని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను త్వ‌ర‌లోనే తెరుస్తామ‌ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ ప‌టేల్ తెలిపారు. జులై 6న తాజ్ మ‌హ‌ల్, ఎర్ర‌కోట‌తో పాటు మిగ‌తా చారిత్ర‌క ప్ర‌దేశాల సంద‌ర్శ‌న‌కు అనుమ‌తిస్తామ‌ని చెప్పారు. ఆర్కియాల‌జిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో సంప్ర‌దించిన త‌ర్వాత ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు.  

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన అన్ని చ‌ర్య‌ల‌ను, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను క‌చ్చితంగా పాటిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యం మేర‌కు మార్చి నెల‌లో అన్ని ప‌ర్యాట‌క దేశాలు, వార‌సత్వ క‌ట్ట‌డాల‌ను మూసివేసిన విష‌యం తెలిసిందే.   


logo