మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 09:04:27

తాజ్‌మహల్‌ను ఇప్పట్లో చూడలేం!

తాజ్‌మహల్‌ను ఇప్పట్లో చూడలేం!

ఆగ్రా: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజ్‌మహల్‌ వంటి చారిత్రక కట్టడాలను సందర్శించే అవకాశం ఇప్పట్లో కన్పించట్లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో స్మాకర కట్టడాలు జూలై 6న తిరిగి తెరుచుకోనున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింఘ్‌ పటేల్‌ ప్రకటించారు. అయితే ఆగ్రాలో కరోనా కేసులు అధికంగా ఉండటం, పర్యాటకుల రాకతో వైరస్‌ మరింత విస్తరించే అవకాశం ఉందని, దీంతో నగరంలోని చారిత్రక కట్టడాలైన తాజ్‌మహల్‌, ఆగ్రా కోట, అక్బర్‌ సమాధి వంటి ఇతర స్మారక చిహ్నాలను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని జిల్లా మేజిస్ట్రేట్‌ ప్రభు సింఘ్‌ తెలిపారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా వాటిని తెరవడం మంచిది కాదని వెల్లడించారు. 

జిల్లాలో 71 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయని, గత నాలుగు రోజుల్లో 55 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఒకవేల స్మారక చిహ్నాలను తెరిచినట్లయితే పర్యాటకులు ఇక్కడి వస్తారని, అది మంచిదికాదని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని స్మారక కట్టడాలను మార్చి నెలలో మూసివేశారు.


logo