గురువారం 09 జూలై 2020
National - May 31, 2020 , 10:14:33

ఆగ్రాలో భారీ వర్షం.. దెబ్బతిన్న తాజ్‌మహల్‌

ఆగ్రాలో భారీ వర్షం.. దెబ్బతిన్న తాజ్‌మహల్‌

లక్నో : యూపీలోని ఆగ్రాలో శుక్రవారం రాత్రి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో తాజ్‌మహల్‌ చెక్క గేటు, పాలరాయి రెయిలింగ్‌, రెండు ఎరుపు సున్నపురాయి పలకలు దెబ్బతిన్నట్లు భారత పురావస్తు శాఖ అధికారి, ఆర్కియాలజిస్ట్‌ వసంత్‌ స్వర్ణకార్‌ తెలిపారు. తాజ్‌ మహల్‌ చుట్టుపక్కల చాలా చెట్లు నేలకొరిగాయి. టిక్కెట్స్‌ కౌంటర్‌తో పాటు పశ్చిమ ఎంట్రీ గేట్‌ దగ్గర పైవోట్‌ రాయి కూడా దెబ్బతిన్నట్లు అధికారి చెప్పారు. 

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

యూపీలోని మెయిన్‌పురి, ఆగ్రా, లఖీంపూర్‌ కేరీ, ముజఫర్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పిడుగు పాటుకు ముగ్గురు వ్యక్తులు, పలు జంతువులు చనిపోయాయి. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం యోగి. 


logo