గురువారం 28 మే 2020
National - May 11, 2020 , 21:42:24

వాళ్లు ఉగ్రవాదుల్లాగా వ్యవహరించారు

వాళ్లు ఉగ్రవాదుల్లాగా వ్యవహరించారు

పాట్నా: బీహార్‌లోని ముజఫ్ఫర్‌పూర్‌ లోక్‌సభ సభ్యుడు అజయ్‌ నిషాద్‌ సోమవారం వివాదాస్పద ప్రకటన చేశారు. నిజాముద్దీన్‌ తబ్లిగీ జమాత్‌ మర్కజ్‌ సభ్యులను ఆయన ఉగ్రవాదులతో  పోల్చారు. కరోనా వైరస్‌ను వ్యాప్తిచెందించడంలో ముస్లిం మిషనరీ ఉద్యమంలోని సభ్యులంతా ఉగ్రవాదుల్లాగే వ్యవహరించారని అజయ్‌ నిషాద్‌ చెప్పారు. వీరి వల్లనే దేశమంతటా కరోనా కేసులు ప్రారంభమయ్యాయని, వీరందరిని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల మాదిరిగానే చూడాలన్నారు. 

ప్రత్యేకంగా జమాత్‌ సభ్యులు నిరక్ష్యరాస్యులు ఐనందున వీరికి కరోనా వైరస్‌ తీవ్రత తెలియడం లేదన్నారు. అంతటితో ఊరుకోకుండా.. మదర్సాలలో వీళ్లు నేర్పేది చదువు కాదు, టైర్లకు పంక్చర్లు ఎలా వేయాలో నేర్పుతారని అన్నారు. మదర్సాలు అమాయక పిల్లలకు మౌలికవాదం గురించి తప్పుడు విద్యను బోధిస్తున్నారని ఆరోపించారు. 


logo