శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 02:35:52

కత్తి మీద సాము

కత్తి మీద సాము

  • టేబుల్‌-టాప్‌ రన్‌వేపై ల్యాండింగ్‌ ప్రమాదకరం 

నాగ్‌పూర్‌: టేబుల్‌టాప్‌ రన్‌వే కారణంగానే కోజికోడ్‌ ప్రమాదం జరిగిందని నిపుణులు అంటున్నారు. ఇంతకూ టేబుల్‌టాప్‌ రన్‌వే అంటే ఏమిటి? కొండలు లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండేచోట ఈ తరహా రన్‌వేలను ఏర్పాటు చేస్తారు. టేబుల్‌లాగే (బల్లలాగే) ఈ రన్‌వేలు ఉంటాయి. పడితే కింద పడిపోవాల్సిందే. సాధారణ విమానాశ్రయాల్లోని రన్‌వేలతో పోలిస్తే వీటి పొడవు, వెడల్పు కూడా తక్కువ. ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ఎత్తైన ప్రదేశంలో టేబుల్‌-టాప్‌ రన్‌వేలు ఉండటం వల్ల వాతావరణంలో మార్పు చోటుచేసుకుంటుండటంతో పైలట్లు కొన్నిసార్లు అయోమయానికి కూడా గురయ్యే అవకాశమున్నది. 

దేశంలో ఉన్న టేబుల్‌-టాప్‌ రన్‌వే విమానాశ్రయాలు

విమానాశ్రయం                
 రన్‌వే పొడవు  
కోజికోడ్‌ (కేరళ)
2,860 మీటర్లు
మంగళూరు (కర్ణాటక)
2,450 మీటర్లు
సిమ్లా (హిమాచల్‌ ప్రదేశ్‌)
1,230 మీటర్లు
పక్యోంగ్‌ (సిక్కిం)
1,700 మీటర్లు
లెంగ్‌ప్యూ (మిజోరాం)
2,500 మీటర్లు

పదేండ్ల క్రితం మంగళూరులో

కోజికోడ్‌ విమాన ప్రమాదం పదేండ్ల క్రితం కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తుకుతెచ్చిందని ఏవియేషన్‌ నిపుణులు అంటున్నారు. 2010 మే 22న జరిగిన ప్రమాదంలో విమానం రన్‌వే నుంచి లోయలోకి జారిపోయి నిప్పంటుకోవటంతో అందులోని 158మంది దుర్మరణంపాలయ్యారు. రెండు ఘటనలకు కారణం టేబుల్‌టాప్‌ రన్‌వేలే. ప్రమాదానికి గురైనవి కూడా ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ బోయింగ్‌ 737 విమానాలే. రెండు విమానాలు దుబాయ్‌ నుంచి వచ్చినవే.  


logo