బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 14, 2020 , 01:35:25

నాడు 15 లక్షల మందిని చంపారు!

నాడు 15 లక్షల మందిని చంపారు!
  • ఆర్మేనియన్‌ జన హననాన్ని గుర్తించిన సిరియా..
  • నాడు 15 లక్షల మందిని చంపారు!

డమస్కస్‌: శతాబ్దం క్రితం జరిగిన ఆర్మేనియన్ల జాతి సంహారాన్ని సిరియా పార్లమెంట్‌ గురువారం నాడు గుర్తించింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1915-1917 మధ్య దాదాపు 15 లక్షల మంది ఆర్మేనియన్లను ఓట్టొమన్‌ (ప్రస్తుత టర్కీ) రాజులు సామూహికంగా సంహరించారని సిరియా పార్లమెంట్‌ పేర్కొంది. నాటి మారణకాండను ఖండిస్తున్నామని తెలిపింది. టర్కీతో ప్రస్తుతం తీవ్రస్థాయిలో సాయుధ ఘర్షణలు జరుగుతున్న సమయంలో సిరియా శతాబ్దం క్రితం జరిగిన ఘటనను వెలుగులోకి తేవడం గమనార్హం. ఓట్టొమన్‌ రాజ్యంలో దాదాపు 15 లక్షల మందిని సామూహికంగా సంహరించారని, ఈ హత్యాకాండను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని ఆర్మేనియన్లు నాటి నుంచి కోరుకుంటున్నారని సిరియా పార్లమెంట్‌ తెలిపింది. అయితే ఈ ఆరోపణలను టర్కీ ఖండించింది. మొదటి ప్రపంచయుద్ధంలో ఆర్మేనియన్లతోపాటు తుర్క్‌లు కూడా మరణించారని.. అయితే వేల సంఖ్యలోనే మరణాలు సంభవించాయని, లక్షల్లో కాదని వివరించింది. వాయవ్య సిరియాలో బుధవారం జరిగిన ఘర్షణల్లో సిరియా తమ 14 మంది సైనికులను హతమార్చిందని టర్కీ ఆరోపించింది. 
logo