కోల్కతా, జూలై 28: చమురును వెలికితీసే కొత్త టెక్నాలజీని ఐఐటీ-ఖరగ్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఫ్రాక్షన్-రెడ్యూస్డ్ పాలిమర్ విధానంలో స్వదేశీ పరిజ్ఞానంతో తాము అభివృద్ధి చేసిన భారీ సింథటిక్ అణువులు ‘ఫ్రాకింగ్’కు సాయపడుతాయన్నారు. అత్యధిక పీడనంతో పాలిమర్ ద్రవాన్ని బావుల్లోకి పంపి చమురును వెలికితీయడమే ఫ్రాకింగ్.