శనివారం 30 మే 2020
National - Mar 25, 2020 , 00:29:33

10 సెకండ్లు ఊపిరి బిగపడితే కరోనా లేనట్టేనా!

10 సెకండ్లు ఊపిరి బిగపడితే కరోనా లేనట్టేనా!

కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొవిడ్‌-19 ఉన్నదా లేదా తెలుసుకునేందుకు 10 సెకండ్లపాటు ఊపిరి బిగపట్టి స్వయంగా తెలుసుకోవచ్చని విస్తృత ప్రచారం సాగుతున్నది. బాగా గాలిపీల్చి 10 సెకండ్లపాటు ఊపిరి బిగపడితే దగ్గు, ఆయాసం, చాతీలో పట్టేసినట్టు అసౌకర్యం వంటి ఇబ్బందులేమీ లేకపోతే (కొవిడ్‌-19 లక్షణం) ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ లేనట్టేనని ఇటీవల ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ కనిపించింది. అయితే ఇది అవాస్తమని నిపుణులు స్పష్టంచేశారు.logo