బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 08:41:00

ఇది చరిత్రాత్మక రోజు.. నిర్భయకు న్యాయం జరిగింది

ఇది చరిత్రాత్మక రోజు.. నిర్భయకు న్యాయం జరిగింది

న్యూఢిల్లీ : నిర్భయకు ఏడేళ్ల తర్వాత న్యాయం జరిగింది అని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ పేర్కొన్నారు. నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది చరిత్రాత్మక రోజు అని చెప్పారు. నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు కావడంతో.. నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని ఆమె తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే రేపిస్టులకు ఉరిశిక్ష తప్పదని దేశం గట్టి సందేశం ఇచ్చిందని స్వాతి మలివాల్‌ పేర్కొన్నారు. నిర్భయ దోషులైన నలుగురికి తీహార్‌లో జైల్లో ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు చేసిన విషయం విదితమే.


logo