సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 19:04:26

బహ్రెయిక్‌లో మిడ‌త‌ల బీభ‌త్సం.. వీడియో

బహ్రెయిక్‌లో మిడ‌త‌ల బీభ‌త్సం.. వీడియో

ల‌క్నో: దేశంలో మిడ‌త‌ల బెడ‌ద ఇంకా తొలగిపోవ‌డం లేదు. గ‌త మూడు నెల‌లుగా ఉత్త‌ర భార‌త‌దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మిడ‌త‌ల గుంపులు దాడులు చేస్తూనే ఉన్నాయి. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా మిడ‌త‌ల పీడ పూర్తిగా విర‌గ‌డ కావ‌డంలేదు. సౌదీ అరేబియా నుంచి వ‌చ్చిన ఈ ఏడారి మిడ‌త‌ల గుంపులు ఎక్క‌డ వాలినా.. క్ష‌ణాల్లో పంట‌ల‌ను నాశ‌నం చేస్తున్నాయి. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బహ్రెయిక్‌లో మిడ‌త‌ల గుంపులు దాడి చేశాయి. అందుకు సంబంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo