ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 12:16:33

మిడతల దాడి మళ్లీ మొదలైంది: వీడియో

 మిడతల దాడి మళ్లీ మొదలైంది: వీడియో

న్యూఢిల్లీ: దేశంలో ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే ఉత్తరాది రాష్ట్రాలను కరోనాతో పాటు, మిడతల దండు కూడా  భయాందోళనలకు గురి చేస్తున్నది. గత రెండు నెలల నుంచి రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సహా పలు  రాష్ట్రాలు మిడతల దండు సమస్యను ఎదుర్కొంటున్నాయి.  తాజాగా మిడతల దండు దాడి మళ్లీ మొదలైంది. గురుగ్రామ్‌ నుంచి ఢిల్లీలోకి మిడత దండు వ్యాపించే ప్రమాదం ఉన్నది. 

పంటలను నాశనం చేసే మిడతల దండు దేశరాజధాని ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌కు చేరుకున్నది.  గురుగ్రామ్‌ సిటీతో పాటు ఆజిల్లాలోని పలు గ్రామాల్లో  మిడతలు వ్యాపిస్తున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీశారు. గురుగ్రామ్‌లోని సైబర్‌ హబ్‌ ప్రాంతంలో మిడతలు వ్యాపిస్తున్నాయి. మిడతలు ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ అధికారులు శుక్రవారం సాయంత్రమే అప్రమత్తం చేశారు. మిడతలు వచ్చినప్పుడు  శబ్దాలు చేయడం ద్వారా వాటిని తరిమికొట్టొచ్చని సూచించారు.


logo