ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 17:34:57

స్వ‌ప్న సురేశ్‌, సందీప్ నాయ‌ర్‌కు 5 రోజుల క‌స్ట‌మ్స్ క‌స్ట‌డీ

స్వ‌ప్న సురేశ్‌, సందీప్ నాయ‌ర్‌కు 5 రోజుల క‌స్ట‌మ్స్ క‌స్ట‌డీ

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో క‌ల‌క‌లం రేపిన బంగారం అక్ర‌మ ర‌వాణా కేసులో నిందితులైన స్వ‌ప్న సురేశ్‌, సందీప్ నాయ‌ర్‌ను ఐదు రోజుల క‌స్ట‌మ్స్ క‌స్ట‌డీకి కోర్టు అప్ప‌గించింది. వారిద్ద‌రిని ఆగ‌స్టు 1 వ‌ర‌కు క‌స్ట‌మ్స్ అధికారులు ప్ర‌శ్నించ‌వ‌చ్చ‌ని కోచిలోని ఆర్థిక నేరాల కోర్టు మంగ‌ళ‌వారం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి యూఏఈలో ఉన్న ఇద్ద‌రు నిందితులు ఫైసల్ ఫరీద్, రాబిన్స్ కరికంకుడిల్ హమీద్‌ల‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ల‌ను కోర్టు జారీ చేసింది. 

మ‌రోవైపు గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులోని మ‌రో నిందితుడు కేటీ రమీస్‌ను కోచిలోని ఎన్ఐఏ ప్ర‌త్యేక కోర్టు ఏడు రోజుల క‌స్ట‌డీకి అప్ప‌గించింది. సీఎం విజ‌య‌న్ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం శివ‌శంక‌ర్‌ను ఎన్ఐఏ అధికారులు మంగ‌ళ‌వారం కూడా ప్ర‌శ్నిస్తున్నారు. దుబాయ్ నుంచి కేర‌ళ‌కు దౌత్య‌మార్గంలో బంగారం అక్ర‌మ ర‌వాణాకు సంబంధించిన కేసులో రెండో నిందితురాలిగా ఉన్న స‌ప్న సురేశ్ తో ఆయ‌న‌కు సంబంధాలున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల శివ‌శంక‌ర్ కు స‌మ‌న్లు జారీ చేసిన ఎన్ఐఏ సోమ‌వారం 9 గంట‌ల‌పాటు ప్ర‌శ్నించింది.

logo