శనివారం 28 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 10:46:31

ఈ నెల 12న జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వామి వివేకానంద విగ్రహం ప్రారంభోత్సవం

ఈ నెల 12న జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వామి వివేకానంద విగ్రహం ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ : జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నెలకొల్పిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న ఆవిష్కరించనున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహాన్ని పూర్వ విద్యార్థుల సహకారంతో జేఎన్‌యూ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కూడా హాజరుకానున్నారు.

జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్ ఎం జగదీశ్ కుమార్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ప్రకటన చేశారు. “గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ.. స్వామి వివేకానంద విగ్రహాన్ని గురువారం సాయంత్రం 6:30 గంటలకు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆవిష్కరిస్తారని ప్రకటించడం సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం జేఎన్‌యూ ఫేస్‌బుక్‌ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది” అని పేర్కొన్నారు. 

ఫీజుల పెంపునకు నిరసనగా గత సంవత్సరం మితవాద సంస్థలకు చెందిన వారు వివేకానంద విగ్రహం వేదికపై అభ్యంతరకరమైన సందేశాలు రాశారు. ఈ విగ్రహం వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద ఉన్నది. ఇక్కడే విద్యార్థులు హాస్టల్ ఫీజులు పెరగడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం వెనుక ఉన్న వారిపై ఫిర్యాదు చేస్తామని జగదీశ్‌ కుమార్ చెప్పారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.