శుక్రవారం 10 జూలై 2020
National - Jun 19, 2020 , 17:26:23

వడదోరలో ఆటోమేటిక్‌ రైల్వేకోచ్‌ వాషింగ్‌ ప్లాంట్‌

వడదోరలో ఆటోమేటిక్‌ రైల్వేకోచ్‌ వాషింగ్‌ ప్లాంట్‌

వడదోర : గుజరాత్‌ రాష్ట్రంలోని వడదోర రైల్వేస్టేషన్‌లో ఆటోమెటిక్‌ రైల్వేకోచ్‌ వాషింగ్‌ ప్లాంట్‌ను గురువారం నెలకొల్పారు. సాధారణంగా ఓ రైల్వేకోచ్‌ను  కడిగేందుకు 24మంది మనుషులు, 1200లీటర్ల నీరు అవసరం. ఆటోమేటిక్‌ వాషింగ్‌ ప్లాంట్‌ ఇదే పనిని కేవలం 250 లీటర్ల నీటితో 8-10నిమిషాలలో చేస్తుంది. రీసైక్లింగ్‌ చేసిన నీటిని ఇది వినియోగించుకోవడంతో సమయంతోపాటు నీరు ఆదా అవుతుంది. ఇందులో వినియోగించిన పరికరాలు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఆటోమేటిక్‌ వాషింగ్‌ ప్లాంట్‌ పర్యావరణ హితం కావడంతో దీన్ని‘స్వదేశీ’ అని పిలుస్తున్నట్లు ఓరియంటల్‌ డీజీఎం చీరాంగ్‌ పాటిల్‌ తెలిపారు. అతిత్వరలో ప్లాంట్‌ను ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.logo