బీజేపీలో చేరిన సువేందు అధికారి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు సువేందు అధికారి బీజేపీలో చేరారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఈ ఉదయం కోల్‌కతాకు చేరుకున్న అమిత్ షా.. అనంతరం పశ్చిమ మిడ్నాపూర్‌లోని ఓ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సభా వేదికపైనే సువేందు బీజేపీ కండువా కప్పుకున్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జితో విభేదించిన సువేందుకు అధికారి గత నెల 27 తన రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అ తర్వాత గత వారం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించారు. తాజాగా రెండు రోజుల క్రితం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి.. ఇవాళ బీజేపీలో చేరారు. 2021 ప్రథమార్ధంలోనే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో తృణమూల్‌లో బలమైన నేతగా ఉన్న సువేందును బీజేపీ తమవైపు రప్పించుకోవడంలో సఫలమైంది.
ఇవి కూడా చదవండి..
గువాహటిలో హుక్కా బార్ల మూసివేత
రైతు ఇంట్లో అమిత్ షా, బీజేపీ నేతల భోజనం
దుకాణంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గుండెపోటుతో శివసేన సీనియర్ నేత మృతి
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.