బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 17:26:39

ఖాకీ తీవ్ర‌వాది ద‌వీంద‌ర్ సింగ్ కు బెయిల్ మంజూరు

ఖాకీ తీవ్ర‌వాది ద‌వీంద‌ర్ సింగ్ కు బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ : ఖాకీ తీవ్రవాది అయిన జ‌మ్మూక‌శ్మీర్ డీఎస్పీ ద‌వీంద‌ర్ సింగ్ కు బెయిల్ మంజూరు అయింది. ద‌వీంద‌ర్ సింగ్ తో పాటు మ‌రో నిందితుడు ఇర్ఫాన్ ష‌ఫీ మీర్ కూడా ఢిల్లీ కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసింది. ఇద్ద‌రు వేర్వేరుగా రూ. ల‌క్ష పూచీక‌త్తు స‌మ‌ర్పించాల‌ని కోర్టు వారిని ఆదేశించింది. వీరిని అరెస్టు చేసి 90 రోజులు కావొస్తున్న‌ప్ప‌టికీ.. ఛార్జిషీటును స‌మ‌ర్పించ‌డంలో విచార‌ణ సంస్థ విఫ‌ల‌మైంద‌ని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ కేసులో ద‌వీంద‌ర్ సింగ్ ను విధుల నుంచి స‌స్పెండ్ చేశారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో జమ్మూక‌శ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఇద్ద‌రు ముజాహిద్దీన్ ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ ద‌వీంద‌ర్ సింగ్ కారులో ప్ర‌యాణిస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అతుల్ గోయల్ నేతృత్వంలోని పోలీస్ బృందం.. డీఎస్పీతో పాటు ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను అదుపులోకి తీసుకున్నారు.  డీఎస్పీ దవీందర్ గతేడాది ప్రెసిడెంట్ పోలీస్ మెడల్‌ను అందుకోవడం విశేషం. 

ఉగ్రవాదులతో పట్టుబడిన తర్వాత దవీందర్ సింగ్ నివాసంలో పోలీసులు  సోదాలు నిర్వహించి, ఒక ఏకే 47 రైఫిల్, రెండు తుపాకులు, మూడు గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారని నిఘా వర్గాల తెలిపాయి.


logo