గురువారం 16 జూలై 2020
National - Jun 20, 2020 , 14:32:16

సుశాంత్‌ మరో షారుక్‌ అవుతాడనుకున్న : కేంద్ర మంత్రి రవిశంకర్

సుశాంత్‌ మరో షారుక్‌ అవుతాడనుకున్న : కేంద్ర మంత్రి రవిశంకర్

పాట్నా : యువ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సినీ, రాయకీయ, క్రీడా ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. సుశాంత్‌ అంత్యక్రియ అనంతరం అతని కుటుంబ సభ్యులు జూన్‌16న పాట్నాకు చేరుకున్నారు. ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ పాట్నాలోని సుశాంత్‌సింగ్‌ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుశాంత్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్నాలోని సుశాంత్‌ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను కలిసి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశానని తెలిపారు.

ప్రతిభ కలిగిన ఓ నటుడి జీవితం ఇలా ముగియడం చాలా బాధకరమన్నారు. ‘సుశాంత్‌ ఎంతో సాధిస్తాడనుకుంటే.. మధ్యలోనూ తనువు చాలించాడు, భవిష్యత్తులో సుశాంత్‌ షారుక్‌ఖాన్‌ అంతటివాడు అవుతాడనుకున్న, కానీ ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం చాలా బాధకరం’ అని అన్నారు. 

అంతకు ముందు సుశాంత్‌ మరణవార్త విన్న రవి శంకర్‌ ‘నేను సుశాంత్ పాట్నాకు చెందిన వాళ్లం, నేను ప్రామాణ స్వీకారం చేసిన తర్వాతా అతను నన్ను కలిసి మాట్లాడాడు. తన జీవితాన్ని ఇంత అర్ధాంతరంగా ముగిస్తాడని అనుకోలేదు’ అని ట్వీటర్‌లో పోస్టు చేశారు.ఽlogo