బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 01:50:56

దావూద్‌ గ్యాంగే సుశాంత్‌ను చంపింది!

దావూద్‌ గ్యాంగే సుశాంత్‌ను చంపింది!

ముంబై: ఇటీవల మరణించిన బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యకాదని, అతన్ని దావూద్‌ ఇబ్రహీం గ్యాంగే పథకం ప్రకారం హత్యచేసిందని రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) మాజీ అధికారి ఎన్‌కే సూద్‌ సంచలన ప్రకటన చేశారు. సుశాంత్‌ను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆయన విడుదలచేసిన ఓ వీడియోలో తెలిపారు. సుశాంత్‌ మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడే దావూద్‌ గ్యాంగ్‌నుంచి బెదిరింపులు రావటంతో మరింత కుంగిపోయాడని వివరించారు. సుశాంత్‌ 50వరకు సిమ్‌కార్డులు మార్చాడని పేర్కొన్నారు. సుశాంత్‌ మరణానికి ఒకరోజు మందు ఇంట్లో సీసీ కెమెరాలు పనిచేయకుండాపోయాని గుర్తుచేశారు. సుశాంత్‌ హత్యవెనుక ఆయన ఇంట్లో పనివాళ్లతోపాటు అతని సన్నిహిత మిత్రులు కూడా ఉన్నారని వెల్లడించారు.


logo