గురువారం 16 జూలై 2020
National - Jun 15, 2020 , 01:27:39

సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

  • ముంబైలోని ఇంట్లో ఉరేసుకున్న యువ నటుడు
  • ప్రముఖుల దిగ్భ్రాంతి ప్రధాని మోదీ సంతాపం
  • సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

ముంబై: బాలీవుడ్‌ యువ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని  తన అపార్ట్‌మెంట్‌లో ఆయన ఉరేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని చెప్పారు. 1986, జనవరి 21న పాట్నాలో జన్మించిన సుశాంత్‌.. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేవారు. ఏఐఈఈఈలో ఆలిండియా 7వ ర్యాంకు సాధించారు. నటనపై ఆసక్తితో ఇంజనీరింగ్‌ విద్యకు మధ్యలోనే స్వస్తిపలికారు. 

తొలుత టెలివిజన్‌ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన ‘కై పో చీ’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. క్రికెటర్‌ ఎమ్మెస్‌ ధోని బయోపిక్‌ ‘ధోని’ చిత్రంతో దేశవ్యాప్త గుర్తింపు పొందారు. కాగా గతంలో సుశాంత్‌ దగ్గర మేనేజర్‌గా పనిచేసిన యువతి గతవారం ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఆత్మహత్య పరిష్కారం కాదని ‘చిచోరే’ చిత్రం ద్వారా సందేశమిచ్చిన సుశాంత్‌.. చివరకు తను కూడా ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం. 


logo