మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 18:23:13

బాలీవుడ్‌లో డ్రగ్స్‌పై జయ షాను ప్రశ్నిస్తున్న ఎన్సీబీ

బాలీవుడ్‌లో డ్రగ్స్‌పై జయ షాను ప్రశ్నిస్తున్న ఎన్సీబీ

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ), ఆయన మాజీ మేనేజర్ జయా షాను ప్రశ్నిస్తున్నది. బాలీవుడ్ స్టార్స్‌తో ఆమెకున్న సంబంధాలు, డ్రగ్స్ వ్యవహారాలపై ఆరా తీస్తున్నది. పలువురు బాలీవుడ్ నటులు డ్రగ్స్ కోసం ఆమెను సంప్రదించేవారని వాట్సాప్ సందేశాల ద్వారా వెలుగుచూసింది. జయా వాట్సాప్ గ్రూప్‌లో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలుఉన్నారు. సీబీడీ ఆయిల్, డ్రగ్స్ వంటి వాటి కోసం ఆమెకు వాట్పాప్ చేసేవారని దర్యాప్తులో తేలింది. దీంతో దీని గురించి జయాను ఎన్సీబీ ప్రశ్నిస్తున్నది. వాట్పాప్‌లో ఆమెతో చాట్ చేసిన ఎస్ఎల్బీ, అమిత్ పేర్ల గురించి ఆరా తీసింది. సుశాంత్‌ సింగ్‌తోపాటు పలువురు బాలీవుడ్ నటులు నిర్వహించిన పార్టీలు, ఆ సందర్భంగా డ్రగ్స్ సరఫరా అంశాలపై జయాను ఎన్సీబీ సోమవారం ప్రశ్నించినట్లు సమాచారం. నటి రియా చక్రవర్తి తర్వాత బాలీవుడ్‌తో సంబంధాలున్న కీలక వ్యక్తి జయా షానే. దీంతో ఆమెను ప్రశ్నించడంతో బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని విషయాలు బయటపడవచ్చని తెలుస్తున్నది.

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo