శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 15:28:36

సుశాంత్ కేసును సీబీఐకి అప్ప‌గించాలి: రామ్ విలాస్ పాశ్వాన్‌

సుశాంత్ కేసును సీబీఐకి అప్ప‌గించాలి: రామ్ విలాస్ పాశ్వాన్‌

పాట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఈ కేసు విష‌యంలో మ‌హారాష్ట్ర‌, బీహార్ రాష్ట్రాల మ‌ధ్య వివాదం నెల‌కొన్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. మ‌రోవైపు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు కేసు న‌మోదు చేయ‌లేద‌ని అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లు కోరుతున్నార‌ని, ఇదే విష‌యంపై సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేతో చిరాగ్ మాట్లాడార‌ని బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న శుక్ర‌వారం ట్వీట్ చేశారు. మ‌రోవైపు పాట్నాలోని డీజీపీ కార్యాల‌యంలో శుక్ర‌వారం ఉన్న‌త‌స్థాయి స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. సుశాంత్ కేసు విష‌యంలో బీహార్ పోలీసు బృందం ముంబైలో నిర్వ‌హిస్తున్న ద‌ర్యాప్తుపై స‌మీక్షించారు.logo