బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 12:42:08

సుశాంత్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సీబీ అధికారికి కరోనా

సుశాంత్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సీబీ అధికారికి కరోనా

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సిట్ బృందంలోని ఒకరికి కరోనా సోకింది. ఆ అధికారికి నిర్వహించిన యాంటీజెన్ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఈ నేపథ్యంలో బృందంలోని అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి సంబంధిత మార్గదర్శకాలు పాటిస్తామని ఎన్సీబీ తెలిపింది. దీంతో బుధవారం ఉదయం ఎన్సీబీ సిట్ కార్యాలయానికి వచ్చిన సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీని వెనక్కి పంపినట్లు పేర్కొంది. తమ కార్యాలయానికి రావాలంటూ శ్రుతి మోడీకి ఎన్సీబీ మంగళవారం సమస్లు జారీ చేసింది. దీంతో ఆమె బుధవారం ఉదయం ముంబైలోని ఎస్పీబీ సిట్ కార్యాలయానికి వచ్చారు. అయితే సిట్ అధికారుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ప్రశ్నించలేదని, తిరిగి పంపినట్లు ఎన్సీబీ తెలిపింది. డ్రగ్స్ వ్యవహారంలో సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు, పని పనిషితోపాటు మరో ఇద్దరు డ్రగ్స్ డీలర్స్‌ను ఎస్సీబీ అరెస్ట్ చేయగా వారంతా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo