మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 20:47:50

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్య పై దర్యాప్తు వేగవంతం

సుశాంత్ మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్య పై దర్యాప్తు వేగవంతం

ముంబై : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కంటే కొన్ని రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా శాలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతి పై దర్యాప్తును వేగవంతం చేసారు పోలీసులు. జూన్ 8 న ఆమె ముంబై మలాద్ లోని తన అపార్ట్ మెంట్ పై నుంచి కిందకు దూకి సూసైడ్ కి పాల్పడింది. అయితే స్థానిక పోలీసులు దానిని యాక్సిడెంటల్ డెత్ గా నమోదు చేసారు.

ఆమె మరణించిన తరవాత సుశాంత్ ఆత్మహత్య చేసుకోవటంతో దిశా మరణం పై కూడా అనుమానాలు మొదలయ్యాయి. దాంతో ఆమె మృతిపై సమగ్ర దర్యాప్తు జరగాలని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ముంబై పోలీసులు ఆమె చుట్టుపక్కల వారి నుంచి దిశ మృతి పై సమాచారం సేకరిస్తున్నారు. అయితే బీజేపీ నేత నారాయణ్ రాణే దిశ ఆత్మహత్య చేసుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. బహుశా అంతకుందు ఆమెపై అత్యాచారం జరిగి ఉండవచ్ఛన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టులో దిశ ప్రైవేటు భాగాలపై గాయాలు ఉన్నట్టు తేలిందన్నారు.


logo