బుధవారం 15 జూలై 2020
National - Jun 18, 2020 , 07:35:14

‘సుశాంత్‌ నిరాశనిస్పృహలకు కారణం తెలియదు’

‘సుశాంత్‌ నిరాశనిస్పృహలకు కారణం తెలియదు’

ముంబై: ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌లో నిరాశానిస్పృహలకు కారణాలు తమకు తెలియదని ముంబై పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అతడి తండ్రి కేకే సింగ్‌ తెలిపారు. సుశాంత్‌ సోదరిలు కూడా తమ సోదరుడి ఆత్మహత్యకు కారణాలు తెలియవన్నారు. వీరితోపాటు పోలీసులు సుశాంత్‌ వంట మనిషి, సంరక్షకుడు, మేనేజర్లతో సహా తొమ్మిది మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. సినిమాల్లో ప్రత్యర్థుల వల్ల సుశాంత్‌ నిరాశానిస్పృహలకు గురయ్యారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


logo