కొవిడ్ వ్యాక్సిన్ : 60 శాతం మంది విముఖత

న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశ ప్రజల్లో ఇప్పటికీ 60 శాతం మంది విముఖత చూపుతున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు విముఖత చూపుతున్న వారి సంఖ్య మూడు వారాల్లో 69 శాతం నుంచి 60 శాతానికి తగ్గిందని లోకల్‌సర్కిల్స్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. తక్షణమే కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రస్తుతం 60 శాతం పౌరులు సిద్ధంగా లేరని ఈ సర్వే తెలిపింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పట్ల భయాలు, క్లినికల్ ట్రయల్స్‌లో ప్రతికూల ఫలితాలు రావడం వంటి పరిణామాలతో గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో 69 శాతం మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు సానుకూలంగా లేరని వెల్లడైంది.
జనవరి తొలి వారం వరకూ ఈ సంఖ్య అలాగే ఉంది. జనవరి 25 నాటికి వ్యాక్సిన్ పట్ల విముఖత చూపేవారి సంఖ్య 60 శాతానికి తగ్గింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై స్పష్టత కొరవడటమే వ్యాక్సిన్ పట్ల భయానికి ప్రధాన కారణమని సర్వే వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనేది తెలియకపోవడంతోనే తాము వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధంగా లేమని సర్వేలో పాల్గొన్నవారిలో 59 శాతం మంది వెల్లడించారు. ఇక వ్యాక్సిన్ సామర్థ్యంపై అనిశ్చితితో తాము వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటామని 14 శాతం మంది వెల్లడించారు. ఇక కొవిడ్-19 ఏ క్షణంలోనైనా దూరమవుతుందని వ్యాక్సిన్ అవసరం లేదని 4 శాతం మంది చెప్పగా, ఇక కొత్తరకం కరోనా వైరస్‌లను ప్రస్తుత వ్యాక్సిన్లు అడ్డుకోలేవని మరో 4 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారని సర్వే తెలిపింది.
తాజావార్తలు
- ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ!
- డే అంతా ‘ఫ్రై’: నిమిషానికి రూ.1450 కోట్లు లాస్!
- క్రికెట్‌కు యూసుఫ్ పఠాన్ గుడ్‌బై
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్‌లో కనిపించిన యూఎఫ్‌వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు