గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 08:40:57

ఢిల్లీలో క‌రోనా వ్యాప్తిపై స‌ర్వే

ఢిల్లీలో క‌రోనా వ్యాప్తిపై స‌ర్వే

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మ‌హ‌మ్మారి‌ విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో న‌గ‌రంలో వైరస్ విస్త‌ర‌ణ‌ తీరును పూర్తిగా తెలుసుకునేందుకు అధికారులు శనివారం సెరోలాజికల్‌ సర్వే ప్రారంభించారు. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో 20 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. వారి శరీరంలో కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీ బాడీలు ఉన్నాయా, ఉంటే ఏ మేర‌కు ఉన్నాయి అనే వివ‌రాల‌ను తెలుసుకునేందుకు ఈ స‌ర్వే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

శ‌రీరాల్లో యాంటీ బాడీల వివ‌రాల‌ను తెలుసుకోవ‌డం ద్వారా ఎవరెవరూ ఈ వైరస్‌ బారినపడే అవకాశం ఉందో ముందే తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ వరకు సెరోలాజికల్‌ సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్న‌ది. ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి నమూనాలు సేకరిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ వెల్ల‌డించారు.  


logo