గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 15:10:12

10 మందిలో 8 మంది కష్టాల్లోకి...

10 మందిలో 8 మంది కష్టాల్లోకి...

తగ్గిన ఆదాయం, పెరిగిన తిండి

అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం సర్వేలో వెల్లడి..

లాక్డౌన్‌ సమయంలో పట్టణ ప్రాంతాల్లోని 10 మంది కార్మికులలో ఎనిమిది మంది ఉద్యోగాలు కోల్పోయారు.  గ్రామీణ 10 మందిలో 6 మంది ఉద్యోగాలు కోల్పోయారని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో తెలిసింది. అదే సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం కూడా పట్టణ ప్రాంతాల్లో దాదాపు మూడింట ఒక వంతు (36%) కు మాత్రమే చేరుకున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో మాత్రం సగం కంటే ఎక్కువ మందికి ప్రభుత్వ సహాయం అందింది.

యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ సస్టేయినబుల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆద్వర్యంలో దేశంలోని 12 రాష్ర్టాల్లోని 4000 మంది శ్రామికులలో నిర్వహించారు. 688 మంది భూమి ఉన్న రైతులలో దాదాపు నాలుగవ వంతు మందికి మాత్రమే పీఎం కిసాన్‌ పథకం కింద నగదు అందింది. కనీస ఉపాధిని కోల్పోయిన వారికి రానున్న రెండు నెలల్లో కనీసం రూ.7 వేలను వారికి ప్రభుత్వం అందిస్తే కొంత ఊరట లభిస్తుందని సంస్థ ప్రభుత్వానికి సూచించింది.

సర్వే ప్రకారం మార్చి 24 నుండి లాక్డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థపై  ముఖ్యంగా వలస కార్మికులు, వారి కుటుంబాలపై భారీగా ప్రభావం పడిందని తెలిసింది. ఈ ప్రభావాలను ఎదుర్కోవటానికి, ఆర్థిక పునరుద్ధరణకు మార్గాన్ని రూపొందించడానికి తక్షణ, మధ్యస్థ, దీర్ఘకాలిక సమగ్ర విధాన చర్యల అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పింది. లాక్డౌన్‌ విధించినప్పటి నుండి ఈ సర్వే ఉపాధి, ఆదాయ స్థాయిలను లెక్కగట్టంది. ఫిబ్రవరిలో ఉన్న పరిస్థితులతో వీటిని పోల్చింది. 90% కంటే ఎక్కువ రైతులు లాక్డౌన్‌ సమయంలో తమ ఉత్పత్తులను పూర్తి ధరకు అమ్మలేదు. అలాగే పట్టణ ప్రాంతాలలో 80% మంది ప్రజలు మునుపటి కంటే తక్కువ ఆహారాన్ని వినియోగించారని సర్వే పేర్కొంది.logo