National
- Dec 20, 2020 , 10:17:07
జమ్ము డీడీసీ ఎన్నికల్లో పోటీచేసిన మాజీ ఉగ్రవాది

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికల్లో మాజీ ఉగ్రవా ది పోటీచేశాడు. రాజౌరీ జిల్లాలోని దర్హల్ మల్కాన్ సీటు నుంచి ఉనాఫ్ మాలిక్ అనే మాజీ ఉగ్రవాది ఎన్నికల బరిలో నిలిచాడు. గతంలో ఉగ్రవాదిగా పనిచేసిన ఆయన పోలీసుల ముందు లొంగిపోయారు. ‘తాను ఏడేండ్ల పాటు ఓ ఉగ్రవాద సంస్థలో డివిజనల్ కమాండర్‌గా పనిచేశాను. ఉగ్రవాదులంతా ఆయుధాలను వదిలి జనజీవన శ్రవంతిలో కలవాలని కోరాడు.
ఎనిమిది విడుతలుగా జరిగిన డీడీసీ ఎన్నికలు శనివారం ముగిశాయి. నిన్న జరిగిన ఆఖరి విడుత పోలింగ్‌లో జమ్ము డివిజన్లో 77.1 శాతం పోలింగ్, కశ్మీర్ డివిజన్లో 29.91 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా జమ్ముకశ్మీర్‌లోని 18 జిల్లాల్లో 51 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్లను ఈనెల 22న లెక్కించనున్నారు.
తాజావార్తలు
- రకుల్ జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
- రిషబ్ పంత్ సూపర్ షో..
- ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా
- కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి
- ఖుషీ కపూర్ ఎంట్రీపై బోనీ కపూర్ క్లారిటీ..!
- తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ
- నేతాజీ జయంతి ఇక పరాక్రమ్ దివస్
- రిపబ్లిక్ డే వేడుకలకు వారికి అనుమతి లేదు..
- ఆయిల్ పామ్ సాగుకు మరింత ప్రోత్సాహం : మంత్రి నిరంజన్‌రెడ్డి
- ఆస్ట్రేలియాలో క్వారెంటైన్.. టెన్షన్లో టెన్నిస్ ప్లేయర్లు
MOST READ
TRENDING