మంగళవారం 26 జనవరి 2021
National - Dec 23, 2020 , 01:45:10

సురేశ్‌ రైనా, సుజైన్‌ ఖాన్‌ అరెస్ట్‌

సురేశ్‌ రైనా, సుజైన్‌ ఖాన్‌ అరెస్ట్‌

  • ముంబై క్లబ్‌లో కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన
  • పోలీసుల దాడి.. అదుపులో 34 మంది

ముంబై: కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన క్రికెటర్‌ సురేశ్‌ రైనా, బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుజైన్‌ ఖాన్‌ తదితరులను ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముంబై విమానాశ్రయం సమీపంలోని క్లబ్‌పై సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు దాడి చేశారు. భౌతికదూరం పాటించకుండా కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు రైనా, సుజైన్‌ ఖాన్‌ సహా 34 మందిని అరెస్ట్‌చేసినట్టు తెలిపారు. వీరిలో 13 మంది మహిళలకు నోటీసులు ఇవ్వగా, పురుషులను అరెస్ట్‌చేసి ఆపై బెయిల్‌ మంజూరుచేసినట్టు చెప్పారు. అరెస్టయినవారిలో పలువురు ప్రముఖులు ఉండగా, 19 మంది ఢిల్లీ, పంజాబ్‌కు చెందినవారని పేర్కొన్నారు. ‘ఇతర పనులపై ముంబై వచ్చిన రైనా.. స్నేహితుడి ఆహ్వానం మేరకు రాత్రి భోజనానికి వచ్చాడ’ని ఆయన తరుఫు వారు వెల్లడించారు.logo