శుక్రవారం 03 జూలై 2020
National - Apr 08, 2020 , 09:02:48

మ‌న హీరోలు..క‌రోనాపై పోలీసుల అవ‌గాహ‌న

మ‌న హీరోలు..క‌రోనాపై పోలీసుల అవ‌గాహ‌న


సూర‌త్‌: క‌రోనా మ‌హమ్మారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌ధాని న‌రేంద్రమోదీ ఆదేశాల మేర‌కు దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్  కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. క‌రోనాను నియంత్రించేందుకు మ‌న హీరోల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను ప్ర‌జ‌లంతా పాటించాల‌ని సూర‌త్ పోలీసులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. చేతిలో ప్ర‌ధాని మోదీ, డాక్ట‌ర్లు, పారిశుద్ద్య కార్మికులు, పోలీసుల ఫొటోలు ముద్రించ‌బ‌డి ఉన్న‌ ప్ల‌కార్డులు ప‌ట్టుకుని..మ‌న హీరోలు..వారి సూచ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

ప్ర‌జ‌లంతా లాక్ డౌన్ నిబంధ‌న‌లు, సామాజిక దూరాన్ని పాటిస్తూ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు. పోలీసులు, అధికార యంత్రాంగం మ‌రోవైపు మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు.
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo