శనివారం 04 జూలై 2020
National - Jun 17, 2020 , 22:01:15

టీవీ పగులగొట్టి.. నిరసన తెలిపి..

టీవీ పగులగొట్టి.. నిరసన తెలిపి..

గుజరాత్‌ : భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్‌ దేశానికి ఓ భారతీయుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యక్తి తమ ఇంట్లో ఉన్న ఖరీదైన టీవీని రెండో అంతస్తు నుంచి కింద పడేశాడు. అలాగే ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే మరికొందరు కూడా కలిసి ఆ టీవీని ముక్కలు ముక్కలు చేశారు. అనంతరం చైనాకు వ్యతిరేకంగా నినదించారు. ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చైనీస్ ఆర్మీ దాడిలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో చైనా మీద దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 


logo