శుక్రవారం 03 జూలై 2020
National - Apr 15, 2020 , 13:20:53

వినూత్న రీతిలో కరోనాపై అవగాహన

వినూత్న రీతిలో కరోనాపై అవగాహన

సూరత్‌: కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సూరత్‌ పాలనా యంత్రాంగం మంగళవారం వినూత్న కార్యక్రమం చేపట్టింది. కరోనా నిర్మూలనకు సంబంధించిన సందేశాలను బ్యానర్లపై రాసి, వాటిని జంతువులకు కట్టి వీధుల్లో తిప్పింది. కుక్కలు, గుర్రాలు, బర్రెలు తదితర జంతువులను ఇందుకు వినియోగించింది. పోలీసులు, అధికారులు ముఖాలకు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనవసరంగా ఇండ్ల నుంచి బయటకు రావద్దు, కరోనాకు బలి కావద్దు అని ప్రజలను హెచ్చరించింది. సూరత్‌లోని ప్రధాన వీధుల్లో ఈ ర్యాలీ సాగింది.     


logo