మంగళవారం 31 మార్చి 2020
National - Feb 21, 2020 , 03:01:50

కట్నం కోసం దారుణంగా హింసిస్తున్నాడు

కట్నం కోసం దారుణంగా హింసిస్తున్నాడు
  • భర్తపై జాతీయ హాకీ టీం మాజీ కెప్టెన్‌ లతాదేవి ఫిర్యాదు

గౌహతి: భర్త తనను కట్టేసి దారుణంగా కొట్టాడని, మూడు గంటలపాటు చిత్రహింసలకు గురిచేశాడని అర్జున అవార్డు గ్రహీత, జాతీయ హాకీ టీం మాజీ కెప్టెన్‌ సూరజ్‌ లతాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వేలో మాజీ ఉద్యోగి అయిన భర్త శాంత కుమార్‌, అదనపుకట్నం కోసం తనను వేధిస్తున్నాడని గురువారం ఆమె ఆరోపించారు. తన పేరుతో ఉన్న భూమిని ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నాడని, నిరాకరించడంతో నాటి నుంచి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఆమె ప్రతిభ ఆధారంగా 2007లో నిర్మించిన బాలీవుడ్‌ చిత్రం ‘చక్‌ దే ఇండియా’ సూపర్‌ హిట్‌ అయ్యి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. 


logo
>>>>>>