ఆదివారం 05 జూలై 2020
National - Jun 26, 2020 , 17:01:37

సంసాద్‌ మహారత్న.. సుప్రియా సూలే

సంసాద్‌ మహారత్న.. సుప్రియా సూలే

న్యూఢిల్లీ: గత లోక్‌సభలో గుణాత్మక ప్రదర్శనకుగాను సంసాద్ మహా రత్న అవార్డుకు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఎంపికయ్యారు. శరద్‌ పవార్‌ కుమార్తె అయిన సుప్రియా.. మహారాష్ట్రలోని బారామతి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి ప్రదర్శనలో సంసద్ రత్న అవార్డుకు ఎంపికైన ఎనిమిది మంది ఎంపీలలో ఆమె కూడా ఉన్నారు. 14 అవార్డులు ప్రకటించగా.. ఆరు అవార్డులు మహారాష్ట్రకు దక్కడం విశేషం.

సంసాద్‌ మహారత్న అవార్డులు పొందినవారిలో .. డాక్టర్ సుభాష్ రామ్‌రావ్ భామ్రే (బీజేపీ, ధూలే, మహారాష్ట్ర), డాక్టర్ హీనా గవిత్ (బీజేపీ, నందూర్‌బార్, మహారాష్ట్ర), డాక్టర్ అమోల్ రామ్‌సింగ్ కొల్హే, (ఎన్సీపీ, శిరూర్, మహారాష్ట్ర). మహిళలు, తొలిసారి ఎంపీలుగా ఎంపికైనా క్యాటగిరిలో డాక్టర్ శశి థరూర్ (కాంగ్రెస్‌, తిరువనంతపురం), డాక్టర్ నిషికాంత్ దుబే (బీజేపీ, గొడ్డా, జార్ఖండ్), అజయ్ మిశ్రా (బీజేపీ, ఖేరి, యూపీ), కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌) ఉన్నారు. బిజు జనతాదళ్‌కు చెందిన భరత్రుహరి మహతాబ్, శివసేనకు చెందిన మావల్ ఎంపి శ్రీరాంగ్ అప్ప బార్నే తోపాటు ఛాయ వర్మ, విష్భర్ ప్రసాద్ నిషాద్‌ కూడా మహారత్న అవార్డును పొందారు. చర్చలు, ప్రశ్నలు, ప్రైవేట్ సభ్యుల బిల్లులు ప్రవేశపెట్టడంలో చూపిన ప్రదర్శనకు గాను సుప్రియా సూలేకు సంసాద్‌ మహారత్న అవార్డుకు ఎంపికయ్యారు.

ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం సూచనల మేరకు 2010 నుంచి పార్లమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చూపే సభ్యులను సంసాద్‌ మహారత్న అవార్డులతో సత్కరించడం ప్రారంభించారు.  A.P.J. అబ్దుల్ కలాం సూచన మేరకు పార్లమెంటు 2010 నుంచి లోక్‌సభలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే ఎంపీలను రత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తోంది.


logo