సోమవారం 01 మార్చి 2021
National - Jan 15, 2021 , 21:45:56

మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ

మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ

న్యూ ఢిల్లీ : ప్ర‌ధాని మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై ఉన్న నమ్మకం కూడా నీరుగారిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. రైతులతో ప్రభుత్వం జరపాల్సిన‌ చర్చలు ఈ నెల 19 కి వాయిదా పడిన నేపద్యంలో నారాయ‌ణ స్పందించారు. రైతుల సమస్యలపై సుప్రీంకోర్టు వేసిన కమిటీని గుర్తించమని నిర్ద్వందంగా రైతు సంఘాలు తిరస్కరించడంతో అత్యున్నత న్యాయస్థానానికి కూడా చెదలు పట్టె పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మోదీ డైరెక్షన్‌లో పని చేయడం వలన అత్యున్నత న్యాయస్థానం కూడా అబాసు పాలైందని అన్నారు. 

తమ సమస్యలు రాజకీయ అంశాలతో ముడిపడిన నేపథ్యంలో ప్రభుత్వంతోనే తేల్చుకుంటాం అని ప్రకటించిన తరుణంలో రైతులతో చర్చలకు ప్రభుత్వం దిగిరాక తప్పులేదన్నారు. మరో వైపు రైతు ఉద్యమాన్ని దేశవ్యాప్తం కాకుండా నిలువరించడానికి అనేకపద్ధతుల్లో రైతు నేతల మధ్య విభేదాలు సృష్టించాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు తెలంగాణలో ముస్లింలపై, ఆంధ్రాలో క్రిస్టియన్‌ల‌పై మతపరమైన అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తూ రైతాంగ ఉద్యమాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. 

అనేక రాష్ట్రాల్లో మతాన్ని అడ్డం పెట్టుకుని రైతాంగ ఉద్యమాన్ని పక్కదారి పాటించాలి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన భయపడేవారు ఎవరూ లేరన్నారు. రైతులు, రైతు సంఘాలు ఓకేతాటిపై గట్టిగా నిలబడ్డారన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్ఫష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్రం దిగిరావాలని తీసుకువ‌చ్చిన‌ మూడు చట్టాలను రద్దు చేయాలని ఆయ‌న‌ డిమాండు చేశారు.

VIDEOS

logo