గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 15:58:06

సుశాంత్ మృతి కేసు: రియా పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు విచార‌ణ‌

సుశాంత్ మృతి కేసు: రియా పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు విచార‌ణ‌

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ మృతి కేసులో అతడి మాజీ స్నేహితురాలు రియా చక్రవర్తి వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఆ పిటిష‌న్‌పై ఆగ‌స్టు 5న విచార‌ణ జ‌రుగ‌నుంది. జ‌స్టిస్ హృషికేశ్‌రాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం రియా పిటిష‌న్‌పై వాద‌న‌లు విన‌నుంది. అయితే ఈ కేసులో ఏదైనా నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే ముందు త‌మ వాద‌న‌లు కూడా వినాలంటూ బీహార్‌, మ‌హారాష్ట్ర పోలీసుల‌తోపాటు సుశాంత్ రాజ్‌పుత్ తండ్రి కూడా సుప్రీంకోర్టులో కేవియ‌ట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 

సుశాంత్‌ సింగ్ బలవన్మరణానికి రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబసభ్యులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్‌సింగ్ తండ్రి బీహార్ రాజ‌ధాని పట్నాలో కేసు వేశారు. ఈ నేప‌థ్యంలో పట్నాలో తనపై దాఖలైన కేసును ముంబయికి బదిలీ చేయాలంటూ రియా చ‌క్ర‌వ‌ర్తి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్ర‌యించింది. దీంతో రియా పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. ఆగ‌స్టు 5న విచార‌ణ జ‌రుప‌నున్న‌ట్లు తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo