గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 11:49:43

సుప్రీం సంచ‌ల‌న తీర్పు.. క్రిప్టోక‌రెన్సీల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

సుప్రీం సంచ‌ల‌న తీర్పు.. క్రిప్టోక‌రెన్సీల‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

హైద‌రాబాద్‌:  సుప్రీంకోర్టు ఇవాళ కీల‌క తీర్పును వెలువ‌రించింది. క్రిప్టోక‌రెన్సీల‌కు అత్యున్న‌త న్యాయ‌స్థానం పచ్చ‌జెండా ఊపింది.  క్రిప్టోక‌రెన్సీలతో లావాదేవీలు చేయ‌రాదు అని భార‌తీయ బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.  వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ లేదా క్రిప్టోక‌రెన్సీగా పేరుగాంచిన బిట్‌కాయిన్ లావాదేవీల‌ను నిలిపివేయాలంటూ 2018 ఏప్రిల్‌లో ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ స‌ర్క్యూల‌ర్‌ను స‌వాల్ చేస్తూ ఇంట‌ర్నెట్ మొబైల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా ఇవాళ సుప్రీంను ఆశ్ర‌యించింది. రోహిట‌న్ నారీమ‌న్‌, ర‌వీంద్ర భ‌ట్‌, సుబ్ర‌మ‌ణియ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ స‌ర్క్యూల‌ర్‌ను కొట్టి వేస్తూ తీర్పును ఇచ్చింది.  ట్రేడింగ్‌లో క్రిప్టోల‌ను ఆర్బీఐ నిషేధించ‌డాన్ని కోర్టు త‌ప్పుప‌ట్టింది. వాస్త‌వానికి క్రిప్టో ట్రేడింగ్‌ను ఆర్బీఐ ఆప‌లేదు. కేవ‌లం బ్యాంకుల‌కు మాత్రం గ‌తంలో ఆర్బీఐ త‌న ఆదేశాల‌ను జారీ చేసింది.
logo