e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News టీకాల‌పై తేడాలేంటి? కేంద్రాన్ని నిల‌దీసిన సుప్రీం

టీకాల‌పై తేడాలేంటి? కేంద్రాన్ని నిల‌దీసిన సుప్రీం

టీకాల‌పై తేడాలేంటి? కేంద్రాన్ని నిల‌దీసిన సుప్రీం

న్యూఢిల్లీ: క‌రోనా నియంత్ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న వ్యాక్సినేష‌న్ విధానాన్ని సుప్రీంకోర్టు త‌ప్పు బ‌ట్టింది. కేంద్ర ప్ర‌భుత్వ వ్యాక్సినేష‌న్ విధానాన్ని సుమోటోగా స్వీక‌రించిన దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈరోజు విచార‌ణ చేప‌ట్టింది. 45 ఏండ్లు దాటిన వారికి ఉచితంగా, 18-45 ఏండ్ల లోపు వారికి ఫీజు వ‌సూలు చేయ‌డం స‌రి కాద‌ని స్ప‌ష్టం చేసింది.

అలాగే కార్య నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరుపై జోక్యం చేసుకోవ‌ద్ద‌న్న వాద‌న‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్ర‌భుత్వాల విధానాల వ‌ల్ల పౌరుల హ‌క్కుల‌కు భంగం వాటిల్లిన‌ప్పుడు తాము చూస్తూ ఊరుకోబోమ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

కోవిడ్‌-19 రెండో వేవ్‌లో అత్య‌ధికంగా దాని బారిన ప‌డిన వారిలో 18-45 ఏండ్ల లోపు వారేన‌ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. వీరిపై వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని, చాలా మంది ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వ్యాక్సినేష‌న్ చాలా కీల‌కం అని వ్యాఖ్యానించింది. కేంద్రం అమ‌లు చేస్తున్న వ్యాక్సినేష‌న్ విధానంలో చాలా లోపాలు ఉన్నాయ‌ని, వాటిని స‌మీక్షించుకుని ముందుకు సాగాల‌ని సూచించింది.

డిసెంబ‌ర్ నాటికి అంద‌రికీ వ్యాక్సినేష‌న్ పూర్తి చేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. దానికి అనుగుణంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాల‌ని స‌ల‌హా సుప్రీంకోర్టు ఇచ్చింది.

వ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను మ‌రోమారు ప‌రిశీలించాల‌ని పేర్కొన్న అత్యున్న‌త న్యాయ‌స్థానం.. వ్యాక్సిన్ కొనుగోలు, దానికి సంబంధించిన ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల‌ని తెలిపింది. అలాగే బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌కు తీసుకున్న చ‌ర్య‌లేమిటో తెలుపాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది.

ఏది ఏమైనా 18-45 ఏండ్ల లోపు పౌరుల‌కు వ్యాక్సినేష‌న్ చేయాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని సుప్రీంకోర్టు తెలిపింది. తొలి రెండు ద‌ఫాలు ఉచితంగా వ్యాక్సినేష‌న్ చేసిన కేంద్రం.. త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ప్రైవేట్ ద‌వాఖాన‌లు కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం స‌హేతుకం కాద‌ని తేల్చి చెప్పింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఆటోకు కరోనా సెగ

దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి

ఆన్‌లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీట‌ర్లు న‌డ‌వాల్సిందే

22 కోట్ల కోవాగ్జిన్ టీకాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్న ముంబై కంపెనీ

మరో వైరస్‌ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్‌ బ్లాక్‌ ఫంగస్‌ కేసు గర్తింపు

అంబులెన్సుల దందా.. 40 కి.మీట‌ర్ల‌కు రూ.17 వేలు

న్యూయార్క్‌ కన్నా ముంబైలో రెట్టింపు!

గర్భిణులకు 2-డీజీ వద్దు

రాందేవ్‌ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ

ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్ లైవ్..

నో డౌట్‌: ఇప్ప‌ట్లో లీట‌ర్ పెట్రోల్ రూ.100 త‌గ్గ‌దు..!!

విదేశీ వ్యాక్సిన్ల‌కు ఆ ర‌క్ష‌ణ క‌ల్పించ‌డానికి సిద్ధం!

పాక్‌తో క‌లిసి వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద మిస్సైళ్ల‌ను ప‌రీక్షిస్తున్న చైనా

పాకిస్థాన్‌లో మ్యూజియాలుగా రాజ్‌క‌పూర్‌, దిలీప్‌కుమార్ ఇళ్లు

అతిపెద్ద మాంస విక్రయ సంస్థ‌పై సైబ‌ర్ దాడి..

ఆ ఒక్క క‌రోనా వేరియంటే ఆందోళ‌న క‌లిగిస్తోంది: డ‌బ్ల్యూహెచ్‌వో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీకాల‌పై తేడాలేంటి? కేంద్రాన్ని నిల‌దీసిన సుప్రీం

ట్రెండింగ్‌

Advertisement