బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 12:22:51

బిహార్ ఎన్నిక‌ల వాయిదా కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

బిహార్ ఎన్నిక‌ల వాయిదా కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ‌

ఢిల్లీ : బిహార్ రాష్ర్ట అసెంబ్లీ ఎన్నిక‌ల వాయిదా కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తిరస్క‌రించింది. అక్టోబర్, నవంబర్‌లలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఈ మేర‌కు భారత ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కొవిడ్‌ -19 మహమ్మారి, రాష్ర్టంలో వరద పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంత‌కుక్రితం సైతం ఆగస్టు 28న ఇదే విధమైన పిటిషన్‌ను స‌ర్వోన్న‌త న్యాయస్థానం విచారించింది. తాజా పిటిష‌న్‌పై తీర్పును వెలువ‌రిస్తూ ఇదేమీ మైద‌నం కాద‌ని,  ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల సంఘం ప్రతిదీ పరిశీలిస్తుందని తెలిపింది. 


logo