సోమవారం 01 జూన్ 2020
National - May 15, 2020 , 12:00:19

మద్యం దుకాణాలపై పిటిషన్‌.. న్యాయవాదికి రూ. లక్ష జరిమానా

మద్యం దుకాణాలపై పిటిషన్‌.. న్యాయవాదికి రూ. లక్ష జరిమానా

న్యూఢిల్లీ : భారత అత్యున్నత న్యాయస్థానం ఓ న్యాయవాదికి రూ. లక్ష జరిమానా విధించింది. లాక్‌డౌన్‌ వేళ మద్యం దుకాణాలు తెరవడాన్ని సవాల్‌ చేస్తూ సదరు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని, ఇతర నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మద్యం దుకాణాల వ్యవహారంపై ఎన్ని పిటిషన్లు దాఖలు చేస్తారని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని ప్రచారం కోసం వాడుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాదికి రూ. లక్ష జరిమానా విధించింది సుప్రీంకోర్టు. 


logo