మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 15:20:48

బాబ్రీపై తీర్పు ఇచ్చిన మాజీ జడ్జి భద్రత పొడిగింపునకు నో

బాబ్రీపై తీర్పు ఇచ్చిన మాజీ జడ్జి భద్రత పొడిగింపునకు నో

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేతపై సెప్టెంబర్ 30న తీర్పు ఇచ్చిన మాజీ న్యాయమూర్తి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ భద్రత పొడిగింపును సుప్రీంకోర్టు నిరాకరించింది. 2015 నుంచి బాబ్రీ కేసుపై విచారణ జరుపుతున్న ఆయన 60 ఏండ్ల వయసులో 2019లోనే రిటైర్డ్‌ కావాల్సి ఉన్నది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన సురేంద్ర కుమార్‌ యాదవ్‌,  బీజేపీ అగ్ర నేతలైన ఎల్‌కే అద్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతితోపాటు 32 మంది నిందితులుగా ఉన్న ప్రముఖులను నిర్దోషులుగా పేర్కొన్నారు. బాబ్రీ మసీదును సంఘ విద్రోహ శక్తులు కూల్చాయని తీర్పు ఇచ్చారు. అనంతరం ఆయన పదవీ విరమణ పొందారు.

కాగా, బాబ్రీ కేసు విచారణ సందర్భంగా తనకు కల్పించిన వ్యక్తిగత భద్రతను పొడిగించాలని కోరుతూ సురేంద్ర కుమార్‌ యాదవ్‌ సెప్టెంబర్‌ 30న సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. సోమవారం దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఆయన వ్యక్తిగత భద్రత పొడిగింపు అవసరం లేదని అభిప్రాయపడింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.