ఆదివారం 05 జూలై 2020
National - Jun 16, 2020 , 01:15:03

‘బీఎస్‌-4 వాహనాలు బంద్‌ తప్పదు’

‘బీఎస్‌-4 వాహనాలు బంద్‌ తప్పదు’

న్యూఢిల్లీ: దేశంలో బీఎస్‌-4 వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్‌కు అనుమతి లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ వాహనాల వల్ల కలిగే కాలుష్యం ప్రజారోగ్యానికి హానికరమని పేర్కొంది. మార్చి 27న తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ వాహన విక్రయాలు జరుపడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-4 వాహనాల విక్రయాలకు అనుమతి ఉండబోదని 2018 అక్టోబర్‌ నాటి ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.logo