బుధవారం 20 జనవరి 2021
National - Dec 18, 2020 , 12:25:59

ఆస్ప‌త్రుల్లో ఫైర్ సేఫ్టీపై సుప్రీంకోర్టు ఆదేశాలు

ఆస్ప‌త్రుల్లో ఫైర్ సేఫ్టీపై సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: ఆస్ప‌త్రుల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించి దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు సుప్రీంకో్ర్టు ఆదేశాలు జారీచేసింది. కొవిడ్ ఆస్ప‌త్రులు సహా దేశంలోని అన్ని ఆస్ప‌త్రుల్లో ప్ర‌తి నెల జ‌రిగే ఫైర్ సేఫ్టీ ఆడిట్‌ను ప‌రిశీలించేందుకు క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. అదేవిధంగా ఆస్ప‌త్రుల్లో ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌ల అమ‌లు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం అన్ని రాష్ట్రాలు త‌ప్ప‌నిస‌రిగా నోడ‌ల్ ఆఫీస‌ర్‌ల‌ను నియ‌మించాల‌ని సుప్రీంకోర్టు సూచించింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo