సోమవారం 13 జూలై 2020
National - Jun 19, 2020 , 16:14:49

గడువులోగా వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించండి: ‌సుప్రీంకోర్టు

గడువులోగా వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించండి: ‌సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:. స్వ‌స్థ‌లాల‌కు వెళ్లాల‌నుకునే వ‌ల‌సకూలీల‌ను పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, నిర్ణీత గ‌డువులోగా అంద‌రినీ స్వ‌స్థ‌లాల‌కు చేర్చాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మ‌రోసారి ఆదేశాలు జారీచేసింది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి త‌మ స్వస్థలాలకు వెళ్ళాలనుకునే వలసకూలీలను పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని ఈ నెల 9న దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు చెప్పింది. 15 రోజుల్లో వ‌ల‌స‌కూలీల త‌ర‌లింపును పూర్తి చేయాల‌ని ఈ తీర్పులో స్ప‌ష్టం చేసింది. 

క‌రోనా మహమ్మారిని నిరోధించేందుకు అమలు చేస్తున్న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం కారణంగా వలస కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీక‌రించి విచార‌ణ జ‌రుపుతున్న‌ది. ఇందులో భాగంగానే 15 రోజుల్లోగా వ‌ల‌స కూలీల‌ను సొంత ప్రాంతాల‌కు పంపాల‌ని ఈ నెల 9న‌ ఆదేశించింది. అంతేగాక కూలీల‌పై ప్ర‌యాణ ఖ‌ర్చుల భారం వేయొద్ద‌ని కూడా న్యాయ‌స్థానం పేర్కొన్న‌ది. 


logo