‘సమాన’ భరణం అంశంలో మీ స్పందనేమిటి?

- కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- అన్ని మతాలకూ ఒకే నిబంధనలుండాలి
- బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్
న్యూఢిల్లీ: లింగం, మతంతో సంబంధం లేకుండా వివాహ వివాదాలకు సంబంధించి చెల్లించే భరణం, పోషణ ఖర్చులు అందరికీ సమానంగా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఇటీవల ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం స్పందన తెలియజేయాలని కేంద్ర హోంశాఖ, లా అండ్ జస్టిస్, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. విడాకులకు సంబంధించి భరణం చెల్లించే అంశంలో మతం, జాతి, కులం, లింగం, జన్మించిన ప్రాంతం వంటి అంశాలను బట్టి కొన్ని భేదాలు ఉన్నాయని బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నిబంధనలు రాజ్యాంగ స్పూర్తికి, అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే వాటిని రద్దు చేసి, చెల్లించే భరణం విషయంలో భారత పౌరులందరినీ సమానంగా చూసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో అభ్యర్థించారు. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతస్థుల పెండ్లి వివాదాలు హిందూ వివాహ చట్టం 1955ను అనుసరించి, ముస్లింల పెండ్లిళ్లకు సంబంధించిన వివాదాలు.. ముస్లిం విమెన్ యాక్ట్ 1986, క్రైస్తవుల పెండ్లి సంబంధిత వివాదాలు.. ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869, పార్శీల పెండ్లిళ్లకు సంబంధించిన వివాదాలను.. పార్శీ మ్యారెజ్, డైవర్స్ యాక్ట్ 1936కు లోబడి పరిష్కరిస్తున్నారని.. అయితే, ఈ చట్టాలు లింగ సమానత్వ సూత్రానికి అనుకూలంగాలేవని పిటిషనర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్‌ను బ్యాన్ చేస్తామంటున్న బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
- సాయుధ దళాల సేవలు అభినందనీయం
- అడ్డుగా ఉన్నాడనే.. భర్తను హత్య చేసింది
- నగరి ఎమ్మెల్యే రోజా కంటతడి
- నేరాలకు ఎంటర్నెట్
- వరి నాటు వేసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఆదిపురుష్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్