సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 15, 2020 , 01:06:12

ఒమర్‌ నిర్బంధంపై సుప్రీంకోర్టు నోటీసులు

ఒమర్‌ నిర్బంధంపై సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లాను నిర్బంధంలో ఉంచడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన సోదరి సారా అబ్దుల్లా పైలట్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని జమ్ముకశ్మీర్‌ అధికార యంత్రాంగానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. తన సోదరుడిని ప్రజా భద్రతా చట్టం(పీఎస్‌ఏ) కింద నిర్బంధించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ సారా అబ్దుల్లా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ఈ వ్యవహారంపై మీ తరఫున ఎవరైనా జమ్ముకశ్మీర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారా? ఈ అంశంపై కేసులు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా’ అని కోర్టు ప్రశ్నించగా... సారా తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందిస్తూ ఎవరూ దీనిపై హైకోర్టును ఆశ్రయించలేదన్నారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీచేసిన న్యాయస్థానం తదుపరి విచారణను పదిహేను రోజుల పాటు వాయిదా వేసింది. 


logo