గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 01:00:09

కమ్యూనిటీ కిచెన్లపై రాష్ర్టాలకు వడ్డన

కమ్యూనిటీ కిచెన్లపై రాష్ర్టాలకు వడ్డన
  • అఫిడవిట్‌ దాఖలుచేయని రాష్ర్టాలకు సుప్రీంకోర్టు రూ.5 లక్షల జరిమానా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్లను (సామూహిక వంటశాలలు) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై అఫిడవిట్‌ దాఖలుచేయని రాష్ర్టాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయా రాష్ర్టాలపై రూ.5 లక్షల జరిమానా విధించింది. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ర్టాలు 24 గంటల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేస్తే రూ.లక్ష మాత్రమే జరిమానా చెల్లించొచ్చని, లేని పక్షంలో రూ.5 లక్షలు కట్టాలని స్పష్టంచేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అఫిడవిట్‌ దాఖలుచేసిన పంజాబ్‌, నాగాలాండ్‌, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, అండమాన్‌ నికోబార్‌ జరిమానా కట్టాల్సిన పనిలేదని తెలిపింది. ఆకలి, పౌష్టికాహార లోపంతో అనేక మంది చిన్నారులు మరణిస్తున్నారని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని పేర్కొంటూ సామాజిక కార్యకర్తలు అనున్‌ ధావన్‌, ఇషాన్‌ ధావన్‌, కుంజనా సింగ్‌ సుప్రీంకోర్టులో ఈ పిల్‌ దాఖలుచేశారు. 
logo