సోమవారం 01 జూన్ 2020
National - May 11, 2020 , 12:39:42

సుప్రీంలో అర్నాబ్ గోస్వామి కేసు విచార‌ణ‌..

సుప్రీంలో అర్నాబ్ గోస్వామి కేసు విచార‌ణ‌..


హైద‌రాబాద్‌: రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్ అర్నాబ్ గోస్వామి త‌న‌పై న‌మోదు అయిన కేసును కొట్టివేయాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ పెట్టుకున్నారు.  దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఏప్రిల్ 15వ తేదీన టీవీ షోలో.. అర్నాబ్ విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు కేసు న‌మోదు అయ్యింది. ఆ కేసులో అర్నాబ్ త‌ర‌పున హ‌రీశ్ సాల్వే ఇవాళ కోర్టులో వాదించారు.  బాంద్రాలో వ‌ల‌స‌కూలీల ఆందోళ‌న‌కు సంబంధించి .. ఓ షోలో అర్నాబ్ కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. ఆ కేసులో న‌మోదు అయిన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాల‌ని అర్నాబ్ కోర్టును ఆశ్ర‌యించారు. జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, ఎంఆర్ షాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్నారు. పాల్గ‌ర్ దాడి కేసులో ముంబై పోలీసులు అర్నాబ్‌ను 12 గంట‌ల పాటు విచారించిన‌ట్లు సాల్వే తెలిపారు.logo