బుధవారం 15 జూలై 2020
National - Jun 18, 2020 , 21:18:53

ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీంకోర్టులో విచారణ

ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీంకోర్టులో విచారణ

న్యూఢిల్లీ : ఏజీఆర్ బకాయిలపై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరిగింది. బకాయిల్లో కొంతమొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాలని కోర్టు టెలికాం కంపెనీలను ఆదేశించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్ర సంక్షోభం నెలకొందని, ఈ సమయంలో ప్రభుత్వానికి నిధులు అవసరమని, వీటిని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సి ఉంటుందని తెలిపింది. 'మీరు కొంత మొత్తాన్ని ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాలి. ప్రస్తుతం ప్రజాప్రయోజనం కోసం ఈ డబ్బు ఎంతో ముఖ్యం. కరోనా సంక్షోభం నేపథ్యంలో వెంటనే ఈ డబ్బును డిపాజిట్ చేయాలి' అని సుప్రీం కోర్టు.. వొడాఫోన్‌ ఐడియాను ఆదేశించింది. సీనియర్ అడ్వోకేట్ ముకుల్ రోహత్గీ వొడాఫోన్ ఐడియా తరఫున వాదనలు వినిపించారు.

డబ్బులు చెల్లిస్తే తమ వద్ద ఏమీ మిగలదని, దీంతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ పరిస్థితి బాగాలేదని, బ్యాంకులు గ్యారెంటీ ఇచ్చే స్థితిలో కూడా లేదని చెప్పారు. ఇప్పటికే కేంద్రం వద్ద రూ.15వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఉందని తెలిపింది. ప్రతి ఏడాది రూ.5వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, తమ చెల్లింపుల కోసం 20ఏళ్లు సమయం ఇవ్వాలని కోరింది. ఏ బ్యాంకు కూడా తమ కంపెనీకి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం కోర్టు ఎదుట వాదనలు వినిపించారు.


logo