శుక్రవారం 27 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 12:36:06

క్రాకర్స్‌పై నిషేధాన్ని స‌వాల్‌చేస్తూ పిటిషిన్‌.. తోసిపుచ్చిన‌ సుప్రీంకోర్టు

క్రాకర్స్‌పై నిషేధాన్ని స‌వాల్‌చేస్తూ పిటిషిన్‌.. తోసిపుచ్చిన‌ సుప్రీంకోర్టు

కోల్‌క‌తా: ప‌ండుగ‌వేళ ప‌టాకులు కాల్చ‌డంపై నిషేధం విధించ‌డాన్ని స‌వాల్‌చూస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పండుగ‌లు జురుపుకోవ‌డం ముఖ్య‌మేన‌ని, అయితే పండుగ‌ల కంటే ప్ర‌జ‌ల జీవితాలు ఇంకా ముఖ్య‌మ‌ని పేర్కొన్న‌ది. పండుగ‌ల ఎంత ప్రాముఖ్య‌త క‌లిగిన‌వో మ‌న అంద‌రికీ తెలుస‌ని, అయితే ప్ర‌స్తుతం మ‌నం క‌రోనా వైర‌స్‌తో పోరాడుతున్నామ‌ని, ఇలాంటి స‌మ‌యంలో ప‌రిస్థితిని మెరుగుప‌ర్చ‌డానికి తీసుకునే నిర్ణ‌యాల‌కు క‌లిసిక‌ట్టుగా మ‌ద్ద‌తు నిలువాల‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి డీవై చంద్ర‌చూడ్ సూచించారు. 

'పండుగ‌లు చాలా ముఖ్యం అనే సంగ‌తి మాకు తెలుసు. కానీ ప్ర‌జ‌ల ప్రాణాలు ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు వారిని కాపాడుకోవ‌డం కోసం ఏదో ఒక ప్ర‌య‌త్నం త‌ప్ప‌క జ‌రుగుతుండాలి. అలాంటి ప్రయ‌త్నాల‌కు అంద‌రూ స‌హ‌క‌రించాలి' అని జ‌స్టిస్ చంద్ర‌చూడ్ పేర్కొన్నారు. ప‌శ్చిమబెంగాల్‌లో క్రాక‌ర్స్‌పై అక్క‌డి ప్ర‌భుత్వం నిషేధం విధించ‌డాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ ఉద‌యం ఆ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. పిటిష‌న్‌ను తోసిపుచ్చుతూ పై వ్యాఖ్య‌లు చేసింది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.